దేశీ ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం 9 పైసలు, 9 పైసలు పైకి కదిలింది. దీంతో హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.76.59కు, డీజిల్ ధర రూ.71.21 చేరింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.76.32కు ఎగసింది. డీజిల్ ధర కూడా 10 పైసలు పెరుగుదలతో రూ.70.62కు చేరింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.75.95కు, డీజిల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.70.28కు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కదిలాయి. పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.72.07కు చేరింది. డీజిల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.65.35కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.77.73కు చేరితే.. డీజిల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.68.51కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1.50 శాతం తగ్గుదలతో 57.92 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 1.83 శాతం తగ్గుదలతో 53.18 డాలర్లకు దిగొచ్చింది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/323wRIA
Comments
Post a Comment