నేటి కాలంలో ప్రజలంతా బిజీబిజీగా గడుపుతున్నారు. కాలం వెంట పరుగెడుతూ అనేక అనారోగ్యాలకు గురి తెచ్చుకుంటున్నారు. పని ఒత్తిడితో పాటు ఇతర సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై ఎంతో వేదన అనుభవిస్తున్నారు. శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారికి యోగ ఎంతగానో స్వాంతన కలిగిస్తుంది. దీన్ని జీవన క్రమంలో అలవాటు చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. చేసేవారికి, కొత్తగా ప్రారంభించేవారికి కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా పాటించి చేస్తే యోగా మనకు సత్ఫలితాలిస్తుంది. అవేంటో చూద్దాం.. * ఆసనాలు ఒక్కరోజు చేసేస్తే ప్రయోజనం ఉండదు. మొదలుపెడితే క్రమం తప్పకుండా చేస్తూనే ఉండాలి * స్నానం చేసిన తర్వాత, చేయక ముందైనా యోగా చేయొచ్చు. కానీ రెండింటి మధ్య అరగంట గ్యాప్ ఉండాలి. * భోజనం లేదా ఇతర ఆహార పదార్థాలు తిన్న వెంటనే యోగా చేయకూడదు. భోజనం చేసిన నాలుగు గంటల తర్వాత గానీ, టిఫిన్ చేసిన 2 గంటల తర్వాత గానీ యోగా చేస్తే ప్రయోజనం ఉంటుంది. యోగాకు ముందు కూల్‌డ్రింకులు, జ్యూస్‌లు తాగడం మంచిదికాదు. * వ్యాయామంతో పాలు యోగా చేసేవారు రెండింటినీ ఒకే సమయంలో చేయకూడదు. * ఏదైనా ఆసనం చివరి దశలో ఉన్నప్పుడు శక్తికి మించి ప్రయత్నించకూడదు. దాన్ని వీలైనంత వేసి ఇంక కష్టం అనుకున్నప్పుడు ముగించాలి. * మహిళలు పీరియడ్స్ టైమ్‌తో వేయరాదు. గర్భిణీలు ఐదో నెల దాటగానే ఆసనాలు వేయడం ఆపేయాలి. డెలివరీ అయ్యాక మూడు నెలల తర్వాత తిరిగి యోగా చేసుకోవచ్చు. * ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని మనసును ప్రశాంతం చేసుకుని ఆసనాలు ప్రారంభించాలి. శరీరంతో పాటు మనసూ తేలికగా ఉన్నప్పుడే యోగా చేయాలి. * ప్రాణాయామం చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తే ఆపేయడం మంచింది. యోగా వల్ల డిప్రెషన్ పోగొట్టుకుని ఎనర్జీని పెంచుకోవాలే తప్ప అత్యుత్సాహానికి పోయి ఇబ్బందులు పడేలా చేయకూడదు
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu http://bit.ly/2WQfSqk
Comments
Post a Comment